యాసంగి పంటలపై రైతులకు అవగాహనయాసంగి పంటలపై రైతులకు అవగాహన
ఇటిక్యాల (జనంసాక్షి) నవంబర్ 25 మండల పరిధిలోని బుడ్డారెడ్డిపల్లి గ్రామంలో రైతులకు యాసంగి పంటలపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ విస్తరణ అధికారి భరత్ సింహా మాట్లాడుతూ యాసంగిలో సాగు చేసుకున్న జొన్న, మొక్కజొన్న, వేరుశనగ పంటలకు వచ్చే తెగుళ్లు, పురుగుల నివారణ సంబంధించి ప్రతి రైతు అవగాహన కలిగి ఉండాలన్నారు. అదేవిదంగా బీన్స్ పంట సాగుచేసిన పొలాన్ని సందర్శించి పోషకాహార లోపాన్ని నివారించేందుకు 25కిజీల యూరియా, 15 కెజిలు పొటాష్ కలిపి ఎకరానికి వేయాలని రైతులకు తెలిపారు. అలాగే రైతులు పంటలను మొక్కల దశలోని తెగుళ్లు, పచ్చపరుగు నివారించేందుకు సలహాలు సూచనలు పొందాలన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ పథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రతి రైతు ఆన్లైన్లో ఈ కేవైసీ చేసుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎర్రన్న, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
యాసంగి పంటలపై రైతులకు అవగాహనయాసంగి పంటలపై రైతులకు అవగాహన




