పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
హుజూర్ నగర్ నవంబర్ 25 (జనంసాక్షి): మండలంలోని గోపాలపురం గ్రామంలో హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. శుక్రవారం గోపాలపురం గ్రామములో ఎస్ డి ఎఫ్ నిధుల నుండి 20 లక్షలు, సిడిఎఫ్ నుండి 5 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.15 లక్షల ఎస్ డి ఎఫ్ నిధులతో టి సీసీ రోడ్ పనులకు,
రూ. 5లక్షల ఎస్ డి ఎఫ్ నిధుల తో పూసలు కమ్యూనిటీ హల్ ప్రహరీ గోడ నిర్మాణం, రూ. 5లక్షల సిడిఎఫ్ నిధులతో ఎస్సీ కమ్యూనిటీ హల్ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమములో హుజుర్ నగర్ జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, ఎంపీటీసీ చీకురి రాజారావు, సర్పంచ్ నాగసైదులు, మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి, గరిడేపల్లి ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్, దేవస్థాన కమిటీ చైర్మన్, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు హుస్సేన్ మియా, టిఆర్ఎస్ మండల యువత అధ్యక్షులు సుందరయ్య, పూసల కమ్యూనిటీ పెద్దలు పొదిలి కొండలు, బిక్షం, రంగయ్య, ఉపేందర్, వెంకట్, రాములు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన




