యుద్ధం మొదలయింది

 

* కార్యకర్తలారా వేలాదిగా తరలిరండి

* కెసిఆర్ కు మూడింది

* టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకళిద్దాం

* బిజెపి స్టేట్ చీఫ్ బండి సంజయ్

కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) :

కెసిఆర్ తో యుద్ధం మొదలైంది. బిజెపి కార్యకర్తలారా వేలాదిగా పాదయాత్రకు తరలిరండి అని బిజెపి శ్రేణులకు బిజెపి స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత పాదయాత్రను కెసిఆర్ అడ్డుకొని తప్పు చేశారన్నారు. ప్రజాస్వామ్యయుతంగా చేపడుతున్న పాదయాత్ర అడ్డుకొని లిక్కర్ మాఫియా లో ఇరుక్కున్న కవిత నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కెసిఆర్ కుటుంబం జైలుకెళ్లడం ఖాయం. టిఆర్ఎస్ చేస్తున్న అరెస్టులకు కు, కేసులకు భయపడకండి. బిస్తర్ పట్టుకొని పాదయాత్రకు రండి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించి వేద్దాం అన్నారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని తెలిపారు. పోలీసులు టిఆర్ఎస్ కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. ఖచ్చితంగా ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగిస్తాం. షెడ్యూల్ ప్రకారమే ముందుకు వెళ్తామని తెలిపారు