యువకున్ని జీపుకు కట్టేసి.. ఆర్మీ చక్కర్లు

జమ్ముకశ్మీర్ లో ఓ యువకున్ని ఆర్మీ జీప్ కు కట్టేసి తీసుకెళ్లిన సంఘటన దుమారం లేపింది. ఈ సంఘటనపై జమ్ముకశ్మీర్ మాజీ మంత్రి ఒమర్ అబ్దుల్లా షాక్ కు గురయ్యారు. ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేస్తూ.. రాళ్లతో దాడి చేస్తే.. శిక్ష ఈ విధంగానే  ఉంటుందన్న హెచ్చరికలా ఉందన్నారాయన. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

బీర్స్వా ప్రాంతంలోని బుడ్గాం జిల్లాలో..  ఓ యువకున్ని కట్టి పడేసి ఆర్మీ జీపుతో జవాన్ లు  కాశ్మీర్ వీధుల్లో సంచరించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారన్నారు ఒమర్ అబ్దుల్లా. వీళ్ల చర్య యువకులను రెచ్చగొట్టేలా లేదా అని ప్రశ్నించారాయన. స్థానిక యుకున్ని జీపు కట్టుకొని సీఆర్ పీఎఫ్ జవాన్ లు అలా ఊరేగడం ఏంటని ప్రశ్నించారాయన.

తాజావార్తలు