హుజూర్ నగర్ మార్చి 20 (జనంసాక్షి): తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపడుతున్న యువగళం పాదయాత్రలో అనంతపూర్ జిల్లా కదిరి నియోజకవర్గంలో హుజూర్ నగర్ టిడిపి పట్టణ ఉపాధ్యక్షుడు కోమరాజు అంజి సోమవారం పాదయాత్రలో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన లోకేష్ తో మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ పార్లమెంట్ పరిదిలో గల సమస్యల పట్ల మాట్లాడటం జరిగిందన్నారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్యలపై కూడా మద్దతు ఇవ్వాలని కోరడం జరిగిందన్నారు. తెలంగాణలో తిరిగి పార్టీకి పూర్వ వైభవం తీసుకు వచ్చేలా కష్టపడాలని యువతకి పెద్దపీట వేసి సహకరిస్తానని పేర్కొన్నారు.
యువగళం పాదయాత్రలో హుజూర్ నగర్ టి.టిడిపి పట్టణ ఉపాధ్యక్షుడు




