జనంసాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ప్రత్యేక చొరవతో కమాన్ పూర్ మండల కేంద్రంలోని చాట్ల రాయమల్లు ఇంటి నుండి ఎస్సి హాస్టల్ వరకు దారికి ఐదు లక్షల రూపాయల సిసి రోడ్డు నిర్మాణ పనులను సోమవారం కమాన్ పూర్ సర్పంచ్ నీలం సరిత, కొబ్బరికాయ కొట్టి ప్రజాప్రతినిధులు, నాయకులు తో కలిసి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు పిన్ రెడ్డి కిషన్ రెడ్డి, ఏఎంసి వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మీమల్లు, ఉప సర్పంచ్ బొజ్జ రాజసాగర్, వార్డ్ సభ్యులు కాస రవి, గసిగంటి అజయ్, నాయకులు నీలం శ్రీనివాస్, గడప కృష్ణమూర్తి, నక్క శంకర్, నీల రాజయ్య, సవాయి శంకర్, కమ్మగోని అనిల్, చిప్పకుర్తి శ్రీనివాస్, సాన సురేష్ స్థానికులు కుక్క చంద్రమౌళి, చాట్ల రాయమల్లు, సుద్దాల మూర్తి లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
సిసి రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్




