యువతకు ఊతం
– క్రీడల్లో యువకులే కీలకం
– సోషల్ మీడియా ఇంచార్జి మనోహర్
అశ్వరావుపేట అక్టోబర్ 30( జనం సాక్షి ) క్రీడల్లో యువకులు ముందుండి తెలంగాణకు మంచి పేరు తెచ్చి పెట్టేలా ఉండాలని సోషల్ మీడియా ఇన్ఛార్జి మనోహర్ అన్నారు. యువతకు ఊతం అందిస్తూ తిరుమల కుంట వాలీబాల్ క్రీడాకారులకు నెట్ వాలీబాల్ ని మనోహర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ క్రీడల్లో యువకులురాణించాలని కోరారు. వాలీబాల్ లో అనేక మార్లు ప్రతిభ కనపరుస్తున్న తిరుమలకుంట వాలీబాల్ జట్టుకు స్థానిక ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు సహకారంతో తాటి ప్రదీప్ చంద్ర వాలీబాల్ నెట్ ను మనోహర్ కు ఇవ్వగా వాలీబాల్ కిట్టు ను తిరుమల కుంట వాలీబాల్ క్రీడాకారుల జట్టుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల కుంట యూత్ వంశి, మురళి, జాను, వెంకీ, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
యువతకు ఊతం




