Wednesday, 4 November 2026

యువతిపై అసభ్య మెసేజ్‌లు పెట్టిన నలుగురి అరెస్టు

బంజారాహిల్స్‌: సోషల్‌ మీడియాలో యువతిపై అసభ్య మెసేజ్‌లు పెట్టిన నలుగురిని సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నగరానికి చెందిన ఓ యువతి బీపీఓ కంపెనీలో నాలుగు నెలల క్రితం ఉద్యోగంలో చేరారు. రెండు నెలలు పనిచేసినా జీతం ఇవ్వకపోవడంతో మానేసింది. అయితే కొద్ది రోజులకు జీతం డబ్బులు అదే కంపెనీలో పనిచేసే సయ్యద్‌ అబ్దుల్‌ ఖాదర్‌ పక్కదోవ పట్టించినట్టు తెలుసుకొని ఆ విషయాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో ఖాదర్‌ కంపెనీ ఎండీ అమిత్‌ లాల్వానితో కలిసి యువతిని దుర్బషలాడుతూ పోస్టింగ్‌లు చేశారు. తిట్లతో రాసిన ప్లకార్డులు తయారు చేసి వాటిని ఉద్యోగుల చేత పట్టించి ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పెట్టారు.
దీనిపై ఆమె ఆగస్టు 8వ తేదీన సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని సెప్టెంబర్‌లో ప్రధాన నిందితులు సయ్యద్‌ అబ్దుల్‌ఖాదర్‌, అమిత్‌ లల్వానిని, ఈ కేసుతో సంబంధం ఉన్న ఎకేందర్‌బిస్తా, కెవిన్‌రోస్‌, మహ్మద్‌ అర్బాజ్‌, సొలొమన్‌ ఫెన్సిస్‌కోను మంగళవారం అరెస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *