Tuesday, 3 November 2026

తిరుమలలో భారీ వర్షం

తిరుమల,మే6(జ‌నంసాక్షి): తిరుమలలో శుక్రవారం గంటపాటు జోరుగా భారీ వర్షం కురిసింది. ఉదయం 10.30 గంటల తర్వాత వర్షం ప్రారంభం కాగా గంట తర్వాత కాస్త ఉధృతి తగ్గింది. దీంతో భక్తులు కొద్దిగా
ఇబ్బందులు పడ్డారు. మరోవైపు అన్నమయ్య భవన్‌లో డైలీ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా భక్తుల నుంచి పలు సమస్యలపై ఫిర్యాదు అందాయి. ప్రతి నెల మొదటి శుక్రవారం ఉదయం 8.30గంటల నుంచి గంటపాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇదిలావుంటే జూన్‌ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో శుక్రవారం అందుబాటులోకి వచ్చాయి. మొత్తం 49,046 టికెట్లను అధికారులు విడుదల చేశారు. ఆన్‌లైన్‌లోవెబ్‌సైట్‌ ద్వారా ముందస్తుగా రిజర్వు చేసుకోవచ్చు. ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు పద్మావతి పరిణయోత్సవం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆ మూడు రోజుల పాటు తోమాల, అర్చన, ఆర్జిత బ్ర¬్మత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *