Thursday, 5 November 2026

యువత ఉపాధి అవకాశాలకు ఊతమిస్తున్న విజేత డిగ్రీ.పీజీ కళాశాల ప్రిన్సిపల్ తెడ్ల ధనుంజయ

 

 

 

 

 

 

 

మిర్యాలగూడ, జనం సాక్షి. ఉపాధి అవకాశాలకు విజేత డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఊతమిస్తుందని కళాశాల ప్రిన్సిపల్ తెడ్ల ధనంజయ అన్నారు. గురువారం కళాశాల ప్రాంగణంలో ఎంఎస్ఎన్ లాబరేటరీస్, పేటీఎం,ఎస్బిఐ లైఫ్, వేస్టేజ్ కంపెనీల తో సంయుక్తం గా ఏర్పాటు చేసిన జాబ్ మేళా కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, భరోసానిచ్చేందుకు జిల్లా ఉపాధి కల్పన అధికారుల సహకారం తో ప్రతి సంవత్సరం ప్రముఖ, కార్పొరేట్ కంపెనీల సహకారంతో జాబ్ మేళాలు ఏర్పాటు చేసి ఎంతమంది నిరుద్యోగ యువతీ యువకులను జీవితంలో నిలబెట్టిన ఘనత తమ కళాశాల కు ఉన్నదని పేర్కొన్నారు. కళాశాలలు అంటే కేవలం చదువు అందించడమే కాకుండా స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించేలా తమ కళాశాల పనితీరు ఉంటుందని .అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతకు భరోసానిచ్చేందుకు స్ధానికంగా ఉన్న పరిశ్రమలు, ఇతరత్రా రంగాల్లో తగిన అవకాశాలు కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు..తమ కళాశాలలో ఉద్యోగ ఎంపిక కు కావలసిన శిక్షణ నిచ్చి అందులో నియామకాలు అయ్యే విధంగా తీర్చిదిద్దుతాము.అందుకే అన్ని రకాల సంస్థ లు తమ కళాశాలలోనే ఉద్యోగ మేళా నిర్వహించి నిపుణులైన ,తమ సంస్థ సామర్థ్యాన్ని పెంచే అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారని అన్నారు.ఈ రోజు నిర్వహించిన జాబ్ మేళాలో 200 పైగా నిరుద్యోగ యువతీ, యువకులు పాల్గొన్నారని అతి త్వరలోనే వారిని పరీక్షించి నియమాక పత్రాలు అందజేస్తారని చుట్టూ పక్కల ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు ఇట్టి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు..నిరుద్యోగ యువత కు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తాము, కళాశాల ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ,పారా మెడికల్ ప్రిన్సిపాల్ బాలక్రిష్ణ, కళాశాల అధ్యాపక బృందం, ఉపాధి కల్పన అధికారులు, కంపెనీ ప్రతినిధులు, నిరుద్యోగ అభ్యర్థులు పాల్గొన్నారు.