Wednesday, 4 November 2026

యువత క్రీడల్లో రాణించాలి. – నెన్నెల ఎస్సై రాజశేఖర్.

 

 

 

 

నెన్నెల, ఏప్రిల్ 20, (జనంసాక్షి )యువత క్రీడల్లో రాణించాలని నెన్నెల ఎస్సై రాజశేఖర్ అన్నారు. గురువారం ఆయన మండలంలోని చిన్న వెంకటాపూర్ గ్రామంలో యువతకు క్రికెట్, వాలీబాల్ కిట్లను అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏదైనా సమస్య ఉంటే పోలీస్ అధికారులకు చెప్పవచ్చు అన్నారు. పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, మీ భద్రత మా బాధ్యత అని అన్నారు. యువత చెడు మార్గాలు నడవకుండా యువత క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. క్రీడలు మానసిక ఉల్లాసం కలిగిస్తాయి అని, భవిష్యత్తులో క్రీడల తో స్పోర్ట్స్ కోటా తో ఉద్యోగాల కు అవకాశం ఉంటుంది అని చిన్నప్పటి నుండి క్రీడల పట్ల అవగాహనా కలిగి ఉండాలి అని దీనితో ఆరోగ్యం గా ఉండి ఉన్నత లక్ష్యాలు సాధిస్తారని అన్నారు. పోలీసులు యువతకు ఎల్లవేళలా సహకరిస్తారని, యువతను ప్రోత్సహించటంలో పోలీసులు ముఖ్య పాత్ర పోషిస్తారని అన్నారు. యువకులు గంజాయి, జూదం వంటి చెడు అలవాట్లకు, ఇతర చెడు మార్గాల వైపు వెళ్లకుండా చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉద్యోగాలు సంపాదించి తల్లిదండ్రులకు పేరు నిలబెట్టాలన్నారు. గ్రామానికి మంచి గుర్తింపు తీసుకురావాలని, అసాంఘిక శక్తుల గురించిన ఎటువంటి సమాచారమైనా పోలీసులకు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ మేకల మల్లేష్, నెన్నెల పోలీసులు విజయ్,అనంత రావు,శ్రీకాంత్, గ్రామ యువత పాల్గొన్నారు.