Wednesday, 4 November 2026

వడ్త్య దేవేందర్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు రంజాన్ తోఫా అందజేత

 

 

 

కొండమల్లేపల్లి ఏప్రిల్ 20 జనంసాక్షి న్యూస్ :పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని గురువారం నాడు కొండమల్లేపల్లి మండల పరిధిలోని ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాను అందించే కార్యక్రమంలో భాగంగా మైనార్టీ సంక్షేమ నాయకులు, గౌస్ మియా, సలాం, షుకూర్, ముజీబ్ ల సమక్షంలో కొండమల్లేపల్లి పట్టణం జనప్రియ గార్డెన్ లో జరిగిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్ పాల్గొని నూటపది పేద ముస్లిం కుటుంబాలకు తోఫాను అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గంలోని ప్రతి ముస్లిం కుటుంబం సంతోషంగా రంజాన్ పండుగ జరుపుకునేలా చూడడమే వడ్త్య దేవేందర్ నాయక్ పౌండేషన్ ధ్యేయమని అన్నారు. అల్లా దయతో తెలంగాణ సమాజం ఆర్థిక, సామాజిక రంగాలలో మరింత పురోగతి సాధించి దేశానికి ఆదర్శంగా నిలవాలని కాంక్షించారు.రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు కేసాని లింగారెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్ గౌడ్, జడ్పిటిసి సలహాదారు పసునూరు యుగేందర్ రెడ్డి, రామాలయ దేవస్థానం చైర్మన్ నాయిని మాధవరెడ్డి, నీలా లక్ష్మయ్య, మాడ్గుల యాదగిరి, గుమ్మడవల్లి సర్పంచ్ గుండెబోయిన లింగం యాదవ్, మైనారిటీ నాయకులు సలాం, గౌస్ మియా, శుకూర్, ముజీబ్,ఖాదర్,జహంగీర్, పాష, ఖలీల్,హబిబ్, ఖాజా మొహినూద్దీన్ సాదిక్, చాంద్, ముస్లిం సోదరులు మహిళలు తదితరులు పాల్గొన్నారు