Wednesday, 4 November 2026

యువత క్రీడారంగంలో రాణించాలి ఏఎస్పి సంకీర్త్

ఏటూరు నాగారం(జనంసాక్షి) జూన్15.ఈ రోజు
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఏటూర్ నాగారం పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో గురువారం వాలీబాల్ క్రీడ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏటూర్ నాగారం ఏఎస్పీ సంకీర్త్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం క్రీడా పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ గ్రామీణ ప్రాంత యువత చదువుతోపాటు క్రీడా నైపుణ్యాన్ని పెంచుకొని క్రీడ రంగంలో రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించాలని అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. క్రీడారంగంలో రాణించిన విద్యార్థులకు భవిష్యత్తులో స్పోర్ట్స్ కోటలో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నుంచి వచ్చిన వారే మట్టిలో మాణిక్యాల వలె మెరిసిపోతున్నారని మన ప్రాంతానికి జిల్లాకు రాష్ట్రానికి గర్వించే విధంగా పేరు తీసుకొచ్చే విధంగా విద్య యువత ముందుకు సాగాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ అంతటి విజయ. జిల్లా కోఆప్షన్ సభ్యురాలు వాలియాబి. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకన్న. ఎటూర్ నాగారం సిఐ మండల రాజు. ఎస్సై శ్రావణ్ కుమార్ క్రీడాకారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.