గద్వాల నడిగడ్డ, జూన్ 15 (జనం సాక్షి);ప్రవేట్,కార్బోరేట్ స్కూల్ ఫీజులను నియంత్రించే సమగ్రమైన చట్టం తేవాలనీ, బుక్స్, యూని ఫామ్స్, స్టేషనరీ అమ్ముతున్న ప్రవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని గురువారము జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పి డి ఎస్ యు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పి డి ఎస్ యు రాష్ట్ర నాయకులు తిరుమలేష్ అన్నారు.
డబ్బులే కాన్సెప్ట్ గా,టెక్నో, ఈ టెక్నో,పేర్లతో కొత్త కొత్తగా ప్రచారంచేసితల్లిదండ్రులనుమభ్యపెడుతున్నారనీ,ఆకర్షణీయమైన పేర్లు కాకుండా కామన్ పేర్లు మాత్రమే పెట్టాలని విద్యా మంత్రిత్వశాఖ ఆదేశాలను జిల్లాలో ఉన్నా ప్రవేట్ పాఠశాలలు భేఖతారు చేస్తున్నారనీ, వీటిని నియంతించాల్సిన జిల్లా ఉన్నతా విద్యాశాఖధికారులు చూసి చూడనట్లు గద్వాల జిల్లాలో ఉన్నా ప్రవేట్ పాఠశాలల వారికి వత్తాసు పలుకుతున్నారనీ, ప్రవేట్ కార్పోరేట్ విద్యాసంస్థలు రంగు రంగుల కరపత్రాలతో ప్రచారాలు నిర్వహిన్నారనీ, ప్రభుత్వం ప్రతిస్టాత్మకంగా తీసుకోచ్చిన విద్యహక్కు చట్టాన్ని ప్రవేట్ కార్పోరేట్ విద్యసంస్థలు తుంగలో తోక్కి పేద బడుగు బలహీన వర్గాల నుంచి లక్షలలో దోపిడీ చేస్తున్నారనీ, విద్యహక్కు చట్టం ప్రకారం ప్రవేట్ విద్యసంస్థలలో 25 శాతం ఉచిత విద్యను అందించడం లేదని జీవో నెం 199 ప్రకారం ఎలాంటి ప్రచారాలు ప్లెక్సీలు కరప్రతాలు ఏర్పటు చేయకూడదని నిబందనలు ఉన్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా ప్రవేట్ కార్పోరేట్ విద్యసంస్థలు ఎన్నికలు తలపించేలా ఇంటింటికి తిరిగి డిస్కాంటో ల పేరుతో ప్రచారాలు నిర్వహిస్తున్నారనీ, స్థానిక విద్యాశాఖ అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెల్లిన ఫలితం లెదనీ, ఇప్పటికైన ప్రవైట్ కార్పోరేట్ విద్యసంస్థలపై చర్యలు తీసుకోక పోతే పి డి ఎస్ యు ఆద్వర్యం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డి ఇ ఓ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నామని, విద్యార్థుల తల్లిదండ్రులారా ఆలోచించండి ప్రవేట్ విద్య సంస్థల వారు చెప్పే మోసపూరిత మాటలు నమ్మకండి అని తిరుమలేష్ అన్నారు.ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు జిల్లా కమిటీ సభ్యులు మన్యం,రాజు కుమార్,మనోహర్,ప్రవీణ్,ప్రకాశ్, రవి,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
గద్వాల జిల్లాలో ప్రవేట్ పాఠశాలలో బుక్స్, యూనిఫామ్స్,స్టేషనరీ అమ్ముతున్న ప్రవేట్ పాఠశాలల పై చర్యలు తీసుకోవాలి.




