Saturday, 7 November 2026

యువత చెడు వ్యసనాలకు బానిసలు కావద్దు * యువతకు పోలీసుల అవగాహన

యువత చెడు వ్యసనాలకు బానిసలు కావద్దు
* యువతకు పోలీసుల అవగాహన

టేకులపల్లి,డిసెంబర్ 20( జనం సాక్షి): యువత చెడు వ్యసనాలు బానిసలు కావద్దని, మంచి ప్రవర్తనతో విద్యనభ్యసిస్తూ ఉన్నత శిఖరాలకు వెళ్లి తల్లిదండ్రులకు, తమ గ్రామానికి మంచి పేరు తెచ్చుకోవాలని టేకులపల్లి పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. మంగళవారం టేకులపల్లి సర్కిల్ పోలీస్ పరిధిలో టేకులపల్లి లో యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారకుండా మంచి ప్రవర్తన తో మంచి గా చదువు కొన్ని తల్లిదండ్రులకు, గురువులకు, ఊరికి మంచి పేరు తీసుకొని రావాలని టేకులపల్లి ఏఎస్ఐ సూర్య, హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు లు అవేర్నెస్ కల్పిస్తూ యువత ను కోరారు.ప్రస్తుతం యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి చెడు దారులకు వెళుతున్నారని, అలాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, విద్యార్థులు, యువత మంచి ప్రవర్తన తో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్, టేకులపల్లి గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు నోముల భానుచందర్, గొల్య తండ పంచాయతీ వార్డు సభ్యులు వెంకన్న, ఇస్లావత్. సాయి, ప్రశాంత్, కిరణ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.