బీసీల హక్కులు కాలరాస్తున్న పార్టీలను,బీసీలు పాతరేయాలి
-బిఎస్పీ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి కుమార్…
నాగర్ కర్నూల్ రూరల్ డిసెంబర్ 20(జనంసాక్షి):బహుజన్ సమాజ్ పార్టీ(బిఎస్పీ) నాగర్ కర్నూల్ మండల కమిటీ ఆధ్వర్యంలో,స్థానిక ఎస్సీ కాంప్లెక్స్ దగ్గర బీసీలకు జనాభా దామాషా ప్రకారం 52శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలని కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేప్పట్టారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా బిఎస్పీ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి.కుమార్,జిల్లా ఇంచార్జ్ అంతటి నాగన్న,జిల్లా కార్యదర్శి బోనాసి.రాంచంద్రంలు హాజరు అయ్యారు.ఈ కార్యక్రమంలో బిఎస్పీ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి.కుమార్ మాట్లాడుతూ,బీసీలను రాజకీయంగా వాడుకుంటూ,బీసీ సమాజం హక్కులు కాలరాస్తున్న దోపిడీ పార్టీలను రానున్న ఎన్నికల్లో పాతరేయాలనీ పిలుపునిచ్చారు.బీసీలకు జనాభా దామాషా ప్రకారం 52శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలని ఆయన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.బీజేపీ,కాంగ్రెస్,తెరాస లాంటి పార్టీలలో పని చేస్తున్న బీసీ సమాజం నాయకులు-కార్యకర్తలు అందరూ తక్షణమే ఆ పార్టీలను వదిలి వేసి రావాలని కోరారు.75ఏండ్లుగా బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు బీసీలను నిలువు దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు.కొన్ని రాష్ట్రాలు 50శాతం సీలింగ్ దాటి రిజర్వేషన్స్ ఇస్తున్నాయని,తెరాస ప్రభుత్వం కూడా రాష్ట్ర బీసీ సమాజ సంక్షేమం కోసం తెలంగాణలో ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని కోరారు.బీసీలకు విద్యా,ఉద్యోగ,రాజకీయ రంగాలలో 52శాతం రిజర్వేషన్స్ ఇచ్చే వరకు బిఎస్పీ పార్టీ పోరాడుతుందని అన్నారు.అట్లాగే జిల్లా కార్యదర్శి బోనాసి.రామచంద్రం మాట్లాడుతూ బీసీ జనగణనను కేంద్రం వెంటనే చేప్పట్టాలని డిమాండ్ చేశారు.జిల్లా ఇంచార్జ్ అంతటి నాగన్న మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బిఎస్పీ పార్టీ బీసీలకు 70ఎమ్మెల్యే స్థానాలను కేటాయిస్తుందని తెలిపారు.ఈకార్యక్రమంలో నాగర్ కర్నూల్ అసెంబ్లీ కమిటీ అధ్యక్షులు పృథ్వీరాజ్,కోశాధికారి ఆనంద్,పట్టణ కమిటీ అధ్యక్షులు కళ్యాణ్,మండల అధ్యక్షులు మడుపు నాగేష్,ప్రధాన కార్యదర్శి వెంకటేష్,బిఎంఎస్ జిల్లా అధ్యక్షులు రాముడు,మండల నాయకులు నాగార్జున,కృష్ణ,భాస్కర్,రాముడు,మంతటి శేఖర్,రాములు,శ్రీను,స్వామిలు పాల్గొన్నారు.అడ్వకేట్ శ్రీకర్,TDP నాయకులు రమేష్,ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు పాలెం నర్సింహా,విజేత జూనియర్ కళాశాల,ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు తమ సంఘీభావాన్ని తెలిపారు.




