కొండమల్లేపల్లి ఫిబ్రవరి 10 (జనంసాక్షి) న్యూస్ : నేటి సమాజంలో మారుతున్న కాలానికి అనుగుణంగా ద్విచక్ర వాహనాల వినియోగం తప్పనిసరి అయిందని మౌలానా ముహమ్మద్ ఉమర్ ఖాన్ , ముహమ్మద్ యూనూస్ అన్నారు శుక్రవారం దేవరకొండ పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ముహమ్మద్ అమేర్ బైక్ సర్వీస్ పాయింట్ ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహన కస్టమర్ల కోసం ఉత్తమ సేవలు అందించాలని నమ్మకం నాణ్యతతో కూడినటువంటి వ్యాపారం చిరకాలం కొనసాగుతుందని వారు పేర్కొన్నారు ద్విచక్ర వాహనాలలో సర్వీసింగ్ తో పాటు అన్ని రకాల ఆయిల్ సర్వీసింగ్ ను చేసేటువంటి సర్వీసింగ్ పాయింట్ గా మంచి పేరు సంపాదించాలని పేర్కొన్నారు. అన్ని రకాల వాహనాలను అన్ని వర్గాల ప్రజలను వినియోగదారులను ఆకట్టుకునే విధంగా సేవలను అందించాలని తెలిపారు. యువత స్వయం ఉపాధి కల్పన లో రాణిస్తూ స్వశక్తిగా ఉపాధి కల్పనను పొందుతుండడం సంతోషదాయకంగా ఉందని అన్నారు .కష్టపడి పనిచేసే రానున్న రోజులలో వ్యాపార అభివృద్ధి మరింత జరగాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముహమ్మద్ జమీల్ హైమద్ , ముహమ్మద్ ఆమేర్అహ్మద్, సయ్యద్ ఆరిఫ్, ముహమ్మద్ అబ్రార్, ముహమ్మద్ ఇలియాస్ భాయ్, ముహమ్మద్ బాబా, బైక్ మెకానిక్ యూనియన్ అధ్యక్షులు నరేష్ రెడ్డి , నల్ల గిరి, బాలరాజ్ గౌడ్, గడ్డం శివ , వంశీ ,రాజు, సన్నీ, సయ్యద్ ఖాదర్, షేక్ జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.




