జనం సాక్షి: కొల్లాపూర్ రూరల్ ఫిబ్రవరి. 10కొల్లాపూర్ మండల సింగోటం గ్రామానికి చెందిన అబ్దుల్ కలాం ఫౌండేషన్ అధ్యక్షుడు రామన్న శుక్రవారం హైదరాబాదు లో సంస్కృతిక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత సింగోటం రామన్న ఈరోజు హైదరాబాద్ కూకట్ పల్లి ప్రభుత్వ కళాశాల అధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అబ్దుల్ కలాం ఫౌండేషన్ అధ్యక్షుడు సింగోటం రామన్న హజరయ్యారు.కళాశాల ప్రధాన అధ్యాపకులు రామన్న ను శాలువాతో మర్యాదపూర్వకంగా సత్కరించారు.ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి యావత్ ప్రపంచానికి నిలువేత్తున నిదర్శనం ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలను అందరు గౌరవిస్తూవస్తున్నారంటే మనందరికీ గర్వకారణం.అలాంటి సాంస్కృతిక సంప్రదాయాలను గౌవరవిస్తూ,కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై వుందని ప్రభుత్వాలు కూడా పాఠశాలలో కళాశాలలో విద్యార్థులకు తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలపై అవగాహన కలిగించే విధంగా చర్యలు తీసుకుంటే ఇంకా బాగా వుంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు సిబ్బంది అబ్దుల్ కలాం ఫౌండేషన్ సభ్యులు రామన్న యువ సైన్యం సభ్యులు విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




