బెంగళూరు : ఐపీఎల్ -8 వేలం బెంగళూరులో ప్రారంభమైంది. ఐపీఎల్ అధ్యక్షుడు రంజీబ్ బిస్వాల్ ఆధ్వర్యంలో వేలం కొనసాగుతోంది. ఈ వేలంలో యువరాజ్‌సింగ్‌ను రూ. 16 కోట్లకు ఢిల్లీడేర్ డేవిల్స్ దక్కించుకుంది. గతేడాది వేలంలో యువరాజ్ రూ. 14 కోట్లు పలికాడు. దినేష్ కార్తీక్ రూ. 10.5 కోట్లు పలికాడు. దినేష్ కార్తీక్‌ను బెంగళూరు రాయల్ చాలెంజర్స్ దక్కించుకుంది. ఐపీఎల్ వేలంలో 344 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. రూ. 3 కోట్లతో మురళీ విజయ్ను పంజాబ్ దక్కించుకుంది. రూ. 7.5 కోట్లతో ఏంజిలో మాథ్యూస్‌ను ఢిల్లీ దక్కించుకుంది.




