Wednesday, 4 November 2026

యువ సమ్మేళనంలో పాల్గొని విజయవంతం చేయండి.

యువ సమ్మేళనంలో పాల్గొని విజయవంతం చేయండి.

ఉత్సవ కమిటీ పట్టణ అధ్యక్షులు బ్యియంకర్ శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 22.. (జనంసాక్షి). అమృతోత్సవాల్లో భాగంగా సిరిసిల్లలో నిర్వహించే యువ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా నైజాం విముక్తా స్వాతంత్ర అనృతో ఉత్సవ కమిటీ పట్టణ అధ్యక్షులు బియ్యంకార్ శ్రీనివాస్ కోరారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నైజాం నుండి విముక్తి పొంది 75 సంవత్సరాల పూర్తవుతున్న సందర్భంగా అమృత ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నవంబర్ 29 న సాయి మణికంఠ ఫంక్షన్ హాల్ లో నిర్వహించే ఉత్సవాలు 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు గల యువతీ యువకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలని సంకల్పంతో ఉత్సవాల నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు చీకోటి అనిల్, ఆడెపు వేణు, ప్రధాన కార్యదర్శి సంగీతం సత్య సాయిరాం పాల్గొన్నారు.