Tuesday, 3 November 2026

యూటీఎఫ్‌ అభ్యర్థిని గెలిపించాలి

నల్గొండ, జనవరి 4 (): ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న యూటీఎఫ్‌ అభ్యర్థి నాగటి నారాయణను వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలిపించాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ రాములు కోరారు. మండల పరిధిలోని లింగంపల్లి, ముకుందాపురం, పెదనెమిల, మద్దిరాల, ఎర్రపహాడ్‌, నూతనకల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సోంబాబు, నర్సయ్య, దానయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *