7న గడప గడపకు ఎమ్మెల్యే

నల్గొండ, జనవరి 4 (): ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కరించేందుకు ఈ నెల 7న చందంపేట మండలంలో గడప గడపకు ఎమ్మెల్యే కార్యక్రమం కొనసాగుతుందని ఎంపీడీవో రాములనాయక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని పోలేపల్లి, తిమ్మాపురం, చందంపేట, ముర్పునూతల, గాగిళ్లాపురం గ్రామాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.