Tuesday, 3 November 2026

6న తెలంగాణ సాహిత్య పాఠశాలల సదస్సు

నల్గొండ, జనవరి 4 (): తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 6న జిల్లా కేంద్రంలోని టౌన్‌హాల్‌లో తెలంగాణ సాహిత్య పాఠశాలల సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, తెలుగు ఉపన్యాసకులు డాక్టర్‌ కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. కనుమరుగవుతున్న తెలంగాణ సంస్కృతి, సాహిత్యంపై నేటి యువతరానికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సదస్సుకు గద్దర్‌, విమలక్క, గౌరిశంకర్‌, హాజరవుతారని తెలిపారు. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *