Tuesday, 3 November 2026

యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్

 

 

 

 

 

జహీరాబాద్ జనవరి 28 (జనం సాక్షి ) మెథడిస్ట్ సెంట్రల్ చర్చి గ్రౌండ్ ఎమ్ వై ఎఫ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లో నిర్వహించిన వాలీబాల్ 19 జట్లు పాల్గొనడం జరిగింది .రాత్రి సుమారు 2 గంటల సాగిన హోరాహోరీ మ్యాచ్ మొదటి బహుమతి 15000 ల రూపాయలు మెదక్ ఫయాజ్ టీం గెలుపొందడం జరిగింది,, రెండో బహుమతి 8000 ల రూపాయలు సంపత్ ఎంపిటిసిటీ, మూడో బహుమతి4000ల రూపాయలు ఎం వై సి గెలవడం జరిగింది. ఈ టోర్నమెంట్ ని స్థానిక కోహిర్ ఎమ్మార్వో,, విజయ్ కుమార్ కోహిర్ ఎస్ ఐ సురేష్ కుమార్, స్థానిక ఎంపిటిసి అనిత సంపత్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. గెలుపొందిన జట్లకు స్థానిక ఎంపిటిసి అనిత సంపత్ కుమార్ చేతుల మీదుగా మరియు స్థానిక పాస్టర్ల చేతుల మీదుగా బహుమతులు అందించడం జరిగిందిఈ టోర్నమెంట్లో స్థానిక పెద్దలు యువకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.