Tuesday, 3 November 2026

సోయిలేని ప్రభుత్వం కండ్లు తెరిపిద్దాం.

 

 

 

 

 

 

-నీటి కేటాయింపులు సాధించుకోలేని అసమర్ధ ప్రభుత్వం.30 నుండి పాదయాత్ర ప్రారంభం.
-మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి.నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జనవరి28(జనంసాక్షి):నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో 8 ఏళ్లు దాటిన ఇప్పటికీ నీళ్ల కేటాయింపులు సాధించుకో లేని అసమర్తపాలనలో మనం ఉన్నామని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదికార పార్టీ పాలకుల కండ్లు తెరిపించడానికి ఈ నెల 30 నుండి పాదయాత్ర ప్రారంభిస్తున్న ట్లు ఆయన పేర్కొన్నారు.కాంగ్రెస్ పోరాటంతో పాటు మీడియాలో వచ్చిన కథనాల వల్లే మార్కండేయ లిఫ్టు పనులు వేగం పెరిగాయని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లు తప్ప జిల్లాలో ఎక్కడ డబుల్ బెడ్రూములు నిర్మించిన పాపాన పోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.నాగర్ కర్నూల్ పెద్ద ముద్దునూరు గన్యాగల వనపట్లలో కొన్ని ఇండ్లు నిర్మించి మమ అనిపించారని ఆయన విమర్శించారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే సమగ్ర సర్వే చేయించి లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారో లెక్కలు తేల్చిన విషయం ఆయన గుర్తు చేశారు.నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావుకు జిల్లా నీటి వాడకం తెలియదా అని ప్రశ్నించారు.చట్ట పరిధిలో ఉన్న నీళ్లను తీసుకురాలేని అసమర్ధ పాలనలో మనం ఉన్నామని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్య వైద్యం కోసం నిధులు అత్యంత స్వల్పంగా ఖర్చు చేస్తున్నారని ఆయన అన్నారు. మూత్రశాలలు తాగునీరు తదితర మౌలిక వసతులు కల్పించలేని దయనీయ స్థితిలో తెలంగాణ విద్యార్థులు ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు.మన్ను ఇసుక భూ కబ్జాల మీద ఉన్న చిత్తశుద్ధి అభివృద్ధిపై లేదని ఆయన గుర్తు చేశారు.టిఆర్ఎస్ బిజెపి తోడుదొంగలుగా మారారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాలకులు కొంత సమయాన్ని అభివృద్ధి కోసం కేటాయించి బడుగు బలహీన వర్గాలను ఆదుకోవాలని ఆయన అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఈనెల 30న జరిగే పాదయాత్రకు ప్రజలు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అర్థం రవి,నాయకులు ఐతోలు లక్ష్మయ్య, బాలగౌడు, శశిధర్ రెడ్డి, నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.