హైదరాబాద్:ఉత్తరప్రదేశ్ గజియాబాద్ లో బాలీవుడ్ నటులు బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ లపై కేసు నమోదయ్యింది. గత ఫ్రిబవరి 15న అడిలైడ్ లో భారత్ -పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ లో వీరిద్దరూ జాతీయ జెండాను మీద కప్పుకున్నారని.. అది జాతీయ జెండాను కించపరచడమేనని పలువురు ఆరోపించారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేశారు.




