జనం సాక్షి/ కొల్చారం మండల పరిధిలోని రంగంపేటలో పలు అభివృద్ధి పనులకు మంగళవారం స్థానిక జెడ్పిటిసి మేఘమాల సంతోష్ కుమార్, ఎంపీపీ మంజులా కాశీనాథ్, స్థానిక సర్పంచ్ బండి సుజాత రమేష్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నిధులతో చేపట్టిన సిసి రోడ్లను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన క్రీడా ప్రాంగణాన్ని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. మిషన్ భగీరథ నిధులతో నిర్మించిన వాటర్ ట్యాంక్ ను ప్రారంభించారు. మైనార్టీలకు 5 లక్షల రూపాయలతో కబ్రిస్తాన్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అలాగే ముస్లిం సోదరులకు కమ్యూనిటీ హాల్, షాపింగ్ కాంప్లెక్స్ అడుగుతున్నారని వాటి మంజూరు కోసం ప్రయత్నిస్తానన్నారు. రంగంపేట పెద్ద గ్రామ మై నందున అభివృద్ధికి మరిన్ని నిధులు తన శాయశక్తుల కృషిచేసి మంజూరు చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే వెంట ఎలక్షన్ రెడ్డి జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు మన్సూర్ అహ్మద్, పంచాయతీ రాజ్ డిఈ అమరేశ్వర్, ఏ ఈ ఇర్ఫా హుస్సేన్, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గౌరీ శంకర్ గుప్తా, మెదక్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సావిత్రి రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పైతర చంద్రశేఖర్ రెడ్డి, ఉప సర్పంచ్ మచ్చ శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు సంతోష్ కుమార్, విపి మల్లేశం, బండి రమేష్, గొకని రాజగౌద్,సాయాగౌడ్, కొమ్ముల రవీందర్ గౌడ్, తలారి దుర్గేష్, మైనార్టీ నాయకులు గౌస్ బాషా, ముజుబ్ తదితరులు పాల్గొన్నారు.




