యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం జనంసాక్షి న్యూస్ జనవరి17/22
ఫోటో రేట్ అఫ్ 01తుర్కపల్లి సమావేశంలో మాట్లాడుతున్న దృశ్యం
బిజెపి పార్టీ బూత్ కమిటీలు, శక్తి కేంద్రాల బలోపేతానికి కృషి చేయాలని బిజెపి రాష్ట్ర నాయకులు సుదగాని హరిశంకర్ గౌడ్, ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పడాల శ్రీనివాసులు అన్నారు. మంగళవారం తుర్కపల్లి మండల కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో బూత్ కమిటీలు, శక్తి కేంద్రాల కమిటీ సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోవు కాలంలో రాష్ట్రంలో బిజెపి బిజెపి కాషాయ జెండా ఎగురుతుందని అన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త సైనికులు పనిచేయాలని అన్నారు. తుర్కపల్లి మండలంలోని గంధ మల్ల గ్రామంలో రిజర్వాయర్ కడతారా లేకుంటే కట్టమని డిక్లేర్ చేయాలని కోరారు. 9 టీఎంసీలు అని చెప్పి ఇంతవరకు ఒక్క గంప మట్టి తీయలేదని టిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని అబద్ధాలే చెప్తున్నారని అన్నారు . గంధమల్ల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. బస్వాపూర్ ప్రాజెక్టు కు ఎలాంటి కాలువలు లేవని అన్నారు. తండావాసులకు నష్ట పరిహారము, ఇంటి స్థలం ఇవ్వకపోవడంతో అనేక ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఇట్టి ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ పెట్టి రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ హక్కు కోల్పోయిందని అన్నారు. తెలంగాణలో ఓట్లు అడిగే నైతిక హక్కును బిఆర్ఎస్ పార్టీ కోల్పోయిందని అన్నారు. అనేక ఉద్యోగాలు నోటిఫికేషన్లకే ప్రభుత్వం పరిమితమవుతుందని అన్నారు. పోలీసు ఉద్యోగాలు తప్ప ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని అన్నారు. బంగారు వాసాల మరి అని ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని కెసిఆర్ మాటల మనిషేనని చేతల మనిషి కాదని అన్నారు .రాబోవు కాలంలో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలోఆలేరు అసెంబ్లీ కన్వీనర్ చెరిగే శ్రీనివాస్, మండల అధ్యక్షులు కొక్కొండ లక్ష్మీ నారాయణ, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆకుల రమేష్, ఆకుల సైదులు, మండల ప్రధాన కార్యదర్శి పెండెం నర్సింహులు, బోరెడ్డి పురుషోత్తం రెడ్డి,దానబోయిన వెంకటేష్ ,ధోనికేన శేఖర్ యాదవ్,శేత్రు నాయక్, రమేష్ నాయక్,మేకల పండు,బొల్లు నర్సింహ యాదవ్,ఏడుముళ్ల ఆంజనేయులు, గొర్ల రామచంద్రం, వల్లేకటి వెంకటేష్, షేక్ చంద్ పాషా,పిట్టల జైరాం,సాయి,వేణు, సోమల్ల కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.




