వరంగల్ ఈస్ట్ మార్చి 22 (జనం సాక్షి)
వరంగల్ నగరంలోని రంగసాయిపేట లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఉగాది పర్వదినం సందర్భంగా మనోళ్లాస సాహితీ కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ వరంగల్ హనుమకొండ శాఖల ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు ఈ సందర్భంగా 60 మంది కవులు పాల్గొన్నారు వారు తమ కవితలను వినిపించారు అదేవిధంగా కవులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో దోమల బిక్షపతి, దోమల నగేష్, జక్కం దామోదర్, దోమల రమేష్, అంకేశ్వరపు కుమారస్వామి, చింతం నాగరాజు, సొల్లేటి లక్ష్మీనారాయణ, ఎఫ్ ఎస్ అలీ, కర్మిళ్ళ బాబురావు మార్గం ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.




