Tuesday, 3 November 2026

రచ్చ జగన్నాథ్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా దెగ్లూర్ జట్టు

 

 

 

 

 

బిచ్కుంద జనవరి 30 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండల కేంద్రంలో జనవరి 28, 29వ తేదీలలో నిర్వహించిన రచ్చ జగన్నాథ్ స్మారక బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతగా దెగ్లర్ కు చెందిన జట్టు గెలుపొందింది. విజేత ఆదర్శ్ జోడి ట్రోఫీ ట్రోఫీతో పాటు 5,555 నగదు, గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నారు. రెండవ స్థానంలో మద్నూర్ కి చెందిన జట్టు, మూడో స్థానంలో పిట్లం కు చెందిన జట్టు, నాలుగో స్థానంలో పిట్లం కు చెందిన జట్లు నిలిచారు. వీరికి ట్రోఫీలతో పాటు గోల్డ్ మెడల్స్, ప్రశంస పత్రం, ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మైపతి హన్మండ్లు సేట్, రచ్చ జగన్నాథ్ స్మృతి సమితి ప్రతినిధి రచ్చ శివకాంత్, బ్యాడ్మింటన్ సభ్యులు రియాజ్, యోగేష్, హన్మంత్ యాదవ్, విట్టల్, సాయిలు మరియు నాగిరెడ్డి పేట్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, పిట్లం, నారాయణఖేడ్, వర్ని, దెగ్లూర్, మద్నూర్ తదితర ప్రాంతాల నుంచి విచ్చేసిన క్రీడాకారులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.