Tuesday, 3 November 2026

లీజు ప్లాట్ల క్రమబద్దీకరణకు చర్యలు తీసుకోవాలి

 

 

 

 

– జిల్లా కలెక్టర్‌కు మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ వినతి జనం సాక్షి , మంథని: పెద్దపెల్లి జిల్లా మంథని మున్సిపల్‌ పరిధిలోని లీజు ప్లాట్లకు క్రమబద్దీకరణ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆరేపల్లి కుమార్ సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లా పరిషత్ చైర్మన్‌ ఫుట్ట మధుకర్, మున్సిపల్‌ చైర్‌ పర్సన్ పుట్ట శైలజ ఆదేశాల మేరకు లీజుదారులతో కలిసి ఆయన కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. అనేక ఏండ్లుగా పంచాయతీ స్థలాల్లో లీజుకు తీసుకుని నివాసం ఉంటున్నారని ఆయన తెలిపారు. మేజర్‌ గ్రామపంచాయతీ నుంచి మున్సిపల్‌గా ఏర్పాటైన తర్వాత లీజు ప్లాట్ల క్రమబద్దీకరణ జరుగుతుందని ఆశించారని, కానీ క్రమబద్దీకరణలో ఆలస్యం అవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లీజుప్లాట్‌లలో అత్యధిక శాతం నిరుపేదలే నివాసం ఉంటుందన్నారని, అలాంటి వారికి శాశ్వతంగా నివాస స్థలాలు అందించేలా కలెక్టర్‌ చొరవ చూపాలన్నారు. జీఓ నంబర్‌ 58 ప్రకారం లీజు ప్లాట్‌ల క్రమబద్దీకరణ చేసి లీజుదారులకు న్యాయంజరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్‌ను కోరారు. ఆయన వెంట కౌన్సిలర్‌ వికె రవి, లీజుదారులు, ఉన్నారు.