రత్నాపూర్ లో హెల్త్ సబ్ సెంటర్ కు రూ.20 లక్షల నిధులు మంజూరు
జనంసాక్షి , రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం భవనంకు నిధులు మంజూరయ్యాయని సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు తెలిపారు. రూ.20 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులు మంజూర్ కు సహకరించిన పెద్దపెల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ కు సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు, ఎంపీటీసీ ధర్ముల. రాజసంపత్, ఉపసర్పంచ్ దుబ్బాక సత్యరెడ్డి, బీ.ఆర్.ఎస్ అధ్యక్షులు బాద్రపు ప్రశాంత రావు, బత్తిని ప్రశాంత్ గౌడ్, యూత్ అధ్యక్షుడు మన్నాల రాహుల్ తదితరులు హర్షం వెలిబుచ్చారు.