రన్‌వేపై దిగుతుండగా కూలిన విమానం

ఐదుగురు సాకర్‌ అభిమానుల మృతి
డొనెన్క్‌ : ఉక్రేయిన్‌లోని డొనెన్క్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విమానం అత్యవసరంగా దిగుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. సాకర్‌ అభిమానులతో వస్తున్న రెండు ఇంజిన్లతో కూడిన ఏఎన్‌ -24 విమానం రన్‌వేపై పొగమంచులో అత్యవసరంగా దిగుతుండగా ఒక్కసారిగా కూలింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రయాణికులు మృతి చెందగా పలువరు గాయపడ్డారు. ప్రమాద సమయంలో 45 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నారు. అధికార యంత్రాంగం వెంటనే సహయక చర్యలు చేపట్టింది. ఘటనపై ఉక్రేయిన్‌ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.