హైదరాబాద్ : కర్ణాటక మాజీ గవర్నర్ వీఎస్ రమాదేవి మృతి దేశానికి తీరని లోటని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం రమాదేవి కుటుంబ సభ్యులకు సంతాప సందేశం పంపారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖా మంత్రి పళ్లం రాజు ,జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ , ఎమ్మెల్సీ షబ్బీర్ ఆలీ ఉదయం రమాదేవి నివాసానివాసానికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులకు సంతాప సందేశాన్ని అందజేశారు.




