Wednesday, 4 November 2026

రసవత్తరంగా కొనసాగిన ఫ్రెండ్స్ వాలీబాల్ పోటీలు

 

 

 

 

జహీరాబాద్. ఫిబ్రవరి 13 (జనం సాక్షి ). నియోజకవర్గ పరిధిలోని కోహిర్ మండలంలోని రాజినెల్లి గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలిబాల్ పోటీలు రసవత్తరంగా సాగాయి, నిర్వాహకులు మ్యాథరి ఆనంద్ ఆహ్వానం మేరకు టౌర్నీకి ముఖ్య అతిధులుగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఖిజర్ యఫై, గుంజోటి ఎంపిటిసి బొమ్మ దేశెట్టి పాటిల్, మొగుడం పల్లి మండల జడ్పిటిసి విజయ్ మోహన్ రెడ్డి, ఏజిపి జి శ్రీనివాస్ రెడ్డి హాజయ్యారు, ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ నాయకులు ఖిజర్ యఫై, ఎంపిటిసి దేశెట్టి పాటిల్ మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్న ఆర్గనైజర్లకి అభినందనలు అని, క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, గెలిచిన వారు భవిషత్తులో మరిన్ని విజయాల కోసం పరితపించాలని, ఓడినవారు గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాలని, రాజినెల్లి గ్రామంలో భవిషత్తులో ఇలాంటి టౌర్నీలకు తమ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ఎంపిటిసి బొమ్మ దేశెట్టి పాటిల్, బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు ఖిజర్ యఫై అన్నారు, మరో ముఖ్య అతిధి మొగుడం పల్లి మండల జడ్పిటిసి విజయ్ మోహన్ రెడ్డి, ప్రభుత్వ ఏజిపి జి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ క్రీడల్లో క్రమశిక్షణ అంకితభావంతో మెలిగిన వారు విజేతలుగా నిలుస్తారని, పోరాటపటిమని కనబరిచే జట్లే చివరికి విజేతగా నిలుస్తాయని, రాబోయే రోజుల్లో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని, ఇంత పెద్ద ఎత్తున జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించడం అభినందనీయం అని ఏజిపి శ్రీనివాస్ రెడ్డి, మండల జడ్పిటిసి విజయ్ మోహన్ రెడ్డి అన్నారు… కార్యక్రమంలో నిర్వాహకులు బి ఆర్ ఎస్ నాయకులు మ్యాథరి ఆనంద్, బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఖిజర్ యఫై, ఎంపిటిసి దేశెట్టి పాటిల్, బి ఆర్ ఎస్ జిల్లా ఎక్జిక్యూటివ్ మేంబర్ విజయ్ రాథోడ్, కోహిర్ ఎంపిటిసి.1 సవుద్ షాహిద్, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇఫ్తేఖర్ అలీ, మాజీ అధ్యక్షుడు ఒమర్ అహేమద్, బీజేపీ మండల అధ్యక్షుడు మనోహర్, ఆర్గనైజర్లు దన్ను, మధుకర్ ఫాస్టర్, లడ్డు, మ్యాథరి లక్ష్మణ్, సి భాస్కర్, ప్రశాంత్, మధుకర్ ఫాస్టర్, అబ్దుల్లా సిద్దిఖీ, జర్నలిస్టు పబ్బతి సంతోష్, ఖాజా పటేల్, మాక్సుద్ ఖాన్, గౌస్ ఖాన్, అబ్దుల్ మాజిద్ ఖాసింపురి, మాక్సుద్ అలీ, మహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు…