Wednesday, 4 November 2026

క్రీడల్లో గెలుపు ఓటములు సహజం : ఎంపీ బీ బీ పాటిల్ జహీరాబాద్.

 

 

 

 

 

 

 

ఆదివారం సాయంత్రం నియోజకవర్గ పరిధిలోని మండలంలోని రాజనల్లి గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 11వ మెగా వాలీబాల్ టోర్నీ పోటీలు రసవతరంగా సాగినాయి టోర్నీ నిర్వాహకులు మాతరి ఆనంద్ ఆహ్వానం మేరకు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బి బి పాటిల్ బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఖిజర్ యఫై, జె కె కన్స్ ట్రాక్షన్ అధినేత గుంజోటి ఎంపిటిసి దేశెట్టి పాటిల్ హాజరయ్యారు, ఈ సందర్భంగా జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బిబి పాటిల్ మాట్లాడుతు రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని ఖేలో తెలంగాణ పేరిట పెద్ద ఎత్తున జిల్లాల వారిగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అనేక వేడుకల్లో స్థానిక ఆటగాళ్లను శిక్షణ ద్వారా వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటి తెలంగాణ రాష్ట్రం పేరును ప్రపంచ వ్యాప్తం చేయాలనే కృత నిశ్చయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, స్థానిక గ్రామీణ ప్రాంతాల ఆటగాళ్లు తమ తమ విభాగాల్లో నైపుణ్యం సాధించి ముందుకు వెళ్లాలని, నిర్వాహకులు మ్యాథరి ఆనంద్ ఇంత పెద్ద ఎత్తున రాజినెల్లి గ్రామంలో వాలీబాల్ టౌర్ని నిర్వహించడం అభినందనీయం అని అన్నారు.. కార్యక్రమంలో సిడిసి చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, జడ్పిటిసి మొగుడంపల్లి మండల జడ్పిటిసి విజయ్ మోహన్ రెడ్డి, గుంజోటి ఎంపిటిసి బొమ్మ దేశెట్టి పాటిల్, బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఖిజర్ యఫై, మండల పార్టీ అధ్యక్షుడు కె నర్సింలు యాదవ్, మాజీ సర్పంచ్ ఏం ఏ కలిమ్, ఎంపిటిసి సవుద్ షాహిద్, మాజీ అధ్యక్షుడు ఒమర్ అహేమద్, మ్యాథరి ఆనంద్, పట్టణ అధ్యక్షుడు ఇఫ్తేఖర్ అలీ, సర్పంచ్ నర్సింలు బిలాల్ పూర్, బి ఆర్ ఎస్ నాయకులు మనియర్ పల్లి రాజ్ కుమార్, ఆర్షద్ ఖాన్, అబ్దుల్ మాజిద్ ఖాసింపురి, ఆర్గనైజర్లు, వలంటైర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు..