Tuesday, 3 November 2026

రాంపూర్లో 7.5 అడుగుల పంచముఖ హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన.

 

 

 

 

 

కోటగిరి మార్చి 11 జనం సాక్షి:-కోటగిరి మండలం రాంపూర్ గ్రామంలోని రామాలయం ఆవరణంలో శనివారం 7.5 అడుగుల పంచముఖ హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం గ్రామ ప్రజల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. వర్ని హనుమాన్ ఆలయ పూజారి రతన్,విగ్రహ దాత కొడాలి రాము కుటుంబ సభ్యులతో ఆలయం లో యజ్ఞ యాగాదులు,హోమాలు,ప్రత్యేక పూజలు నిర్వహించి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గ్రామస్థులు మహా అన్నదానం నిర్వహించారు.ఈ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం లో గ్రామ ప్రజా ప్రతినిధులు,గ్రామ పెద్దలు,మహిళలు, ప్రజలు,చూట్టు పక్కల గ్రామాల ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.