వేములవాడ, మార్చి 11 (జనం సాక్షి): వేములవాడ పట్టణంలోని కేరళ మోడల్ స్కూల్ 23వ వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. వేముల పట్టణంలో మొదటిసారి ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన ప్రారంభించి, స్థానిక విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నారని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. విద్యతోపాటుగా కల్చరర్ ప్రోగ్రామ్స్ విద్యార్థులలో మానసిక అభివృద్ధికి దోహదపడతాయని మునిసిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు అన్నారు. విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మహంకాళి శక్తి స్వరూప్ బ్యాచ్ చేసిన నృత్యం చూపర్లను విశేషంగా అలరించింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి భూక్య బన్నాజి, కౌన్సిలర్లు నరాల శేఖర్, సి ఆర్ పి ఆకుల శ్రీనివాస్, కరస్పాండెంట్ మనోజ్ ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఘనంగా కేరళ స్కూల్ వార్షికోత్సవం




