జుక్కల్,ఎప్రిల్17, (జనంసాక్షి),కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండలం రాచూర్ గ్రామంలో ముగ్గురు లబ్ధిదారులకు పెరటి కోళ్లను సర్పంచ్ పార్వతి బాయి పంపిణీ చేశారు.ఈ సందర్బంగా స్ధానిక పశువైద్యాదికారి బి. విజయ్ మాట్లాడుతుఒక్కొక్క లబ్దిదారుడికి 45 కోళ్లు పంపిణీ చేశామన్నారు. ప్రభుత్వ సబ్సిడీపోను ఒక యూనిట్ కి ఒకవేయి ఎనబై రూపాయలు లబ్దిదారులు చెల్లించారని ఆయన తెలిపారు.ఈ కోడిపిల్లల వయస్సు ఒక నెల ఉంటుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు ఉన్నారు.




