రాజంపేట్ న్యూస్

పోలీస్ ఉద్యోగానికి ఎంపికైన ఆణిముత్యాలు

రాజంపేట్ అక్టోబర్ 5 జనంసాక్షి

రాజంపేట్ మండలంలోని ఆయా గ్రామాల విద్యార్థులు పోలీస్ ఉద్యోగానికి ఎంపిక ఎల్లాపూర్ తండా సంగి వెన్నెల, గుండారం సందీప్, శ్రీనివాస్,ఆర్గోoడ గ్రామానికి చెందిన కొర్పోల్ సతీష్,సట్టిగారి ప్రణీత, తలమడ్ల నర్మల విజయభాస్కర్, వడ్ల ప్రవీణ్, శెట్టి గాడి ప్రవీణ్, సౌజన్య, పోలీస్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.నిరుపేద కుటుంబంలో పుట్టి ఎంతో కస్టపడి,మా తల్లి తండ్రులు వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటు మమ్మల్ని ఉన్నత చదువులు చదివించడం వల్ల మేము ఈ ఉద్యోగాలకు ఎంపిక అవ్వడం సాధ్యమైంది అన్నారు. పోలీస్ ఉద్యోగాలకు ఎంపిక కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. సమాజానికి మేలు చేసే విదంగా విధులు నిర్వహించి మా గ్రామానికి మంచి పేరు తీసుకొస్తామని తెలిపారు.గ్రామంలోని యువత పట్టుదలతో చదివి మాలాగే ఇంకా ఉన్నతమైన ఉద్యోగాలు సాధించాలని సూచించారు .గ్రామంలోని యువకులు, గ్రామస్తులు పోలీస్ ఉద్యోగాలకు ఎంపిక కావడంతో వీరి పట్ల హర్షం వ్యక్తం చేశారు.