Tuesday, 3 November 2026

రాజకీయ పార్టీలతో సమావేశమైన ఎన్నికల కమీషనర్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌రెడ్డి సమావేశమయ్యారు. సమావేశంలో పంచాయితీ ఎన్నికల నిర్వహణపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో అభ్యర్థుల ఎన్నికల వ్యయం , డిపాజిట్‌ల పెంపు వంటి అంశాలపై పార్టీల నుంచి రమాకాంత్‌రెడ్డి అభిప్రాయాలు తీసుకోనున్నారు. ఈ సమావేశానికి గుర్తింపు పొందిన 15 రాజకీయ పార్టీలు హాజరయ్యాయి. గుర్తంపు లేకపోవడంతో వైఎస్సార్‌సీపీని అధికారులు పిలవలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *