హైదరాబాద్: రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలు తెలంగాణ విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయని తెలంగాణ ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఇప్పటి వరకు అధికారంలో ఉన్న తెదేపా, కాంగ్రెస్ పార్టీలు ఎందుకు ఆ పనిచేయలేదని నాయిని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో కలిసి నాయిని జాతీయ జెండా ఎగరవేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత రాజకీయాల ద్వారా ఓట్లు దండుకునేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రజలు అలాంటి పార్టీలను నమ్మే స్థితిలో లేరని తెలిపారు. భాజపా నిర్వహించే సభలోనూ కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాల్గోవడం సరైంది కాదని, విలీన దినోత్సవం విషయంలో భాజపా వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని కోరారు.





