Thursday, 5 November 2026

రాజకీయ లబ్ది కోసమే దశబ్ది ఉత్సవాలు కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు నన్నెబొయిన రమేష్

జనం సాక్షి, చెన్న రావు పేటదశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా జరిపి రాజకీయంగా లబ్ది పొందడనికే కొన్ని వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు నన్నెబొయిన రమేష్ యాదవ్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో తడిసి అన్నదాతలు అన్నమో రామచంద్ర అని ఏడుస్తుంటే పట్టించుకోని బిఆరెస్ ప్రబుత్వం దశాబ్ది ఉత్సవాలు చేసుకుంటూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ,ప్రజలను మరొకసారి మోసం చేసి అధికారంలోకి రావడానికి కొత్త నాటకం ఆడుతున్నాడని మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నన్నెబొయిన రమేష్ యాదవ్ విమర్శించారు.మన రాష్ట్ర ముఖ్య పండుగ బతుకమ్మ వేడుక అక్టోబర్ మాసం లో పెద్ద ఎత్తున మహిళలు జరుపుకుంటారు.కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత లాగా వ్యవహరిస్తూ మహిళల చేత చెరువుల వద్దకు బతుకమ్మని తీసుకొని వెళ్లి ఆటలాడిస్తూ ముఖ్యమంత్రి పైశాచిక ఆనందం పొందుతున్నడాని అన్నారు.నియోజకవర్గ పరిధిలో నీళ్లు రాని చెరువులు చాలా ఉన్నాయని కానీ ఎందుకు చెరువుల దగ్గర ఉత్సవాలను జరుపుతున్నారో వారికే తెల్వలని అన్నారు.అదేవిధంగా ఎంతో మంది ఉద్యమకారుల పోరాటాల ఫలితంగా తెలంగాణ సాధిస్తే కనీసము ఎక్కడ కూడా అమరవీరుల ని స్మరించకుండా కేవలం బిఆరెస్ వేడుకల లాగా చేస్తున్నారని నాయకులు సొంత డబ్బా కొట్టుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేసారు. సుమారు 105 కోట్ల తో వేడుకలు నిర్వహిస్తున్నారని అభివృద్ధి ని పక్కకి పెట్టి డబ్బును వృధా చేస్తున్నారని అభివృద్ధి చేయాలనుకుంటే చాలా గ్రామాలు అభివృద్ధి కి నోచుకోకుండా ఉన్నాయని కాంగ్రెస్ మండల ఉపాద్యక్షులు నన్నెబొయిన రమేష్ యాదవ్ అన్నారు.