జనం సాక్షి దుబ్బాకతరలివచ్చిన వేలాది మంది యువతీ, యువకులు…1758 మందికి స్పాట్ లో ఆఫర్ లెటర్స్దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు ఆధ్వర్యంలో సింధు భారతి ఫౌండేషన్ నిర్వహించిన ‘మెగా జాబ్ మేళా’ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.దుబ్బాక నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత ఈ మెగా జాబ్ మేళాకు హాజరయ్యారు. ఈ మెగా జాబ్ మేళాకు 5825 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో 1758 మందిని వివిధ కంపెనీలు స్పాట్ లో రిక్రూట్ చేసుకున్నాయి. స్పాట్ లో ఉద్యోగాలు పొందిన వారికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు మరియు ఆయా సంస్థ HR సిబ్బంది నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు అంబటి బాలేష్ గౌడ్ ఎంపీటీసీ పరికి రవి, చింత సంతోష్ ,గూడశ్రీకాంత్ రెడ్డి ,దూలం వెంకట్ గౌడ్ మాధవ నేను భాను, సుంకు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు
దుబ్బాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు నిర్వహించిన ‘మెగా జాబ్ మేళా’ గ్రాండ్ సక్సెస్




