Monday, 2 November 2026

రాజకీయ లబ్ధి కోసమే విపక్షాల ఆందోళనలు : బొత్స

హైదరాబాద్‌ : విద్యుత్‌ ఛార్జీల పెంపు వల్ల సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ కోరారు. గాంధీభవన్‌లో బొత్స మీడియాతో మాట్లాడారు. ప్రజలపై విద్యుత్‌ భారం పడకుండా చూడాలని ప్రభుత్వం ముఖ్యమంత్రిని పార్టీ తరపున కోరుతున్నట్లు చెప్పారు. ఛార్జీల పెంపుతో మధ్యతరగతి కుటుంబాల్లో ఆర్ధిక ఇబ్బందులు రాకుండా చూస్తామని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌, ఉత్పత్తి మధ్య 62 మిలియన్‌ యూనిట్లు వ్యత్యాసం ఉందని తెలిపారు. ప్రతిపక్షాలు రాజకీయ అబ్ధి కోసమే ఆందోళనలు చేస్తున్నాయని మండిపడ్డారు. అధిక ధరకు పక్క రాష్ట్రం నుంచి విద్యుత్‌ కొనాలన్నా అదీ ప్రజా ధనమేగా? అని ప్రశ్నించారు. విద్యుత్‌ ఛార్జీలు పెంచమని తాము ఎప్పుడూ చెప్పలేదే అన్ని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *