Tuesday, 3 November 2026

ఖాళీ బిందెలతో మంత్రిని అడ్డుకున్న మహిళలు

రెంజల్‌: మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల నిర్మాణ పనులకు భూమిపూజ చేయడానికి ఆదివారం వచ్చిన మంత్రి సుదర్శన్‌రెడ్డిని మహిళలు అడ్డుకున్నారు. గత ఐదు నెలలుగా తాగు నీటి సమస్య నెలకొన్న పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని ఆగ్రహించిన రెంజల్‌ మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. దీంతో స్పందించిన మంత్రి సుదర్శన్‌రెడ్డి 15 రోజుల వ్యవధిలో తాగునీటి ట్యాంకును నిర్మించి సమస్య పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *