రాజపేటలో దివ్యాంగుల దినోత్సవం
రాజాపేట, డిసెంబర్3 ( జనం సాక్షి ): అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాజపేట భవిత వేడుకల సంబరాలు శనివారం ఘనంగా నిర్వహించారు. దివ్యాంగుల తల్లిదండ్రులు పిల్లలను చూసి కృంగిపోవాల్సిన అవసరం లేదని, వాళ్లు భవిష్యత్తు చాలా బాగుంటుంది అన్నారు. టెన్త్ క్లాస్ వరకు వచ్చేటప్పటికి పరీక్షల్లో రాయితీ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుందని తెలియపరిచారు. ఐఆర్పి సత్యం, ఐఆర్పి సంధ్యారాణి భవిత సెంటర్లోని డైలీ శిక్షణ కార్యక్రమాల గురించి వారికి తెలిపారు. ఏ విధంగా శిక్షణ ఇవ్వడం వల్ల ఎన్ని ఏ విధంగా డెవలప్ చేయడం, కొంతమంది ఉదాహరణల ద్వారా వాళ్ళకి తల్లిదండ్రులకు వివరించారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి జింగిటి కృష్ణ, మహేందర్ రెడ్డి, కరుణ కుమారి, సంధ్యారాణి,సత్యం, ఎం ఆర్ సి స్టాప్ ఉప్పల స్వప్న సి ఆర్ పి లు వెంకట రెడ్డి పద్మజ రాణి రాధిక పాల్గొన్నారు




