Tuesday, 3 November 2026

రాజయ్య నివాసానికి చేరుకున్న సారిక తల్లి, సోదరి, పోలీస్ అధికారులు

వరంగల్ : వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఇంటికి పోలీస్ అధికారులతోపాటు మృతిచెందిన రాజయ్య కోడలు సారిక తల్లి, సోదరి అర్చన తదితరులు బుధవారం మధ్యాహ్నం చేరుకున్నారు. రాజయ్య కోడలు సారికతోపాటు ఆమె ముగ్గురు పిల్లలు అనుమానాస్పద స్థితిలో బుధవారం తెల్లవారుజామున మృతిచెందిన విషయం తెలిసిందే. సారిక తల్లిదండ్రులు నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డికి సమీపంలో ఉండగా వారు అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నానికి చేరుకున్నారు. అలాగే ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపేందుకుగానూ ఐజీ నవీన్ చంద్, డీఐజీ మల్లారెడ్డి, ఎస్పీ అంబర్ కిషోర్ ఝా తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇంటిని పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *