Tuesday, 3 November 2026

రాజీనామాలతో నేడు సోనియాకు లేఖ

హైదరాబాద్‌: తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు అవసరమన్న ప్రకటనలపై మండిపడుతున్న తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు పార్టీ అధిష్ఠానంపై ఒతిడి పెంచేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామాలు చేయాలని నిర్ణయించారు. తెలంగాణ ఏర్పాటు కాకపోతే కాంగ్రెస్‌లో కొనసాగలేమనే విషయాన్ని స్పష్టం చేస్తూ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి నేడు లేఖ రాయనున్నారు. లేఖతోపాటే రాజీనామా పత్రాలను పంపబోతున్నారు. నిన్న వివేక్‌ నివాసంలో భేటీ అయిన ఎంపీలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *