హైదరాబాద్ : హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారని డీకె అరుణ తెలిపారు. ఆమె మంగళవారం హోంమంత్రిని కలిసి పరామర్శించారు. అనంతరం డీకె అరుణ మాట్లాడుతూ వాస్తవాలు తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సబితా ఇంద్రారెడ్డిని కోరినట్లు తెలిపారు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దని సూచించినట్లు ఆమె పేర్కొన్నారు.




